MAA: 'మా'లో రచ్చకెక్కిన విభేదాలు.. జీవిత స్పందన

  • 'మా' సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయి
  • విభేదాలను పరిష్కరించుకునేందుకే సమావేశాన్ని నిర్వహించాం
  • ఈసీ సభ్యులతో సమావేశం నిర్వహించాలనుకున్నా.. సాధ్యపడలేదు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో విభేదాలు రచ్చకెక్కాయి. అధ్యక్షుడు నరేశ్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మధ్య అగాధం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో, మా సభ్యులతో నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నరేశ్ హాజరు కాకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది.

ఈ నేపథ్యంలో జీవిత మాట్లాడుతూ, మా సభ్యుల మధ్య విభేదాలు తార స్థాయికి చేరిన మాట నిజమేనని అంగీకరించారు. ఈ కారణం వల్లే సమావేశాన్ని ఏర్పాటు చేశామని... ఎవరెవరు ఏమేం చేస్తారు? ఎవరెవరు ఏమేం చేయలేరు? అనే విషయాన్ని చర్చించేందుకు సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులతోనే సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ, అది సాధ్యపడలేదని జీవిత తెలిపారు. ఈ కారణం వల్లే అసోసియేషన్ లోని అందరు సభ్యులతో సమావేశాన్ని నిర్వహించాల్సి వచ్చిందని చెప్పారు. 26 మంది కమిటీ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు యత్నిస్తున్నామని తెలిపారు.

More Telugu News