Hyderabad: ఎల్బీనగర్‌లోని షైన్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి

  • అద్దాలు బద్దలుగొట్టి రోగులను కాపాడిన పోలీసులు
  • మంటల్లో చిక్కుకున్న నలుగురికి గాయాలు
  • ప్రమాద కారణంపై పోలీసుల ఆరా
హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని షైన్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. కొంతమంది రోగులను అద్దాలు బద్దలుగొట్టి రక్షించారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Hyderabad
LB Nagar
Shine hospital
Fire Accident

More Telugu News