Congress: టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పై కేసు నమోదు!

  • హుజూర్ నగర్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఉత్తమ్
  • ఈసీకి టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
  • ఉత్తమ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. హుజూర్ నగర్ లోని తన నివాసంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారని ఉత్తమ్ పై ఈసీకి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈవిధంగా ప్రెస్ మీట్ నిర్వహించడం, ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, ఉత్తమ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీకి టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఓ లేఖ రాశారు.
Congress
T-pcc
president
Uttam Kumar Reddy

More Telugu News