India: బ్రేకింగ్... పీఓకేపై విరుచుకుపడ్డ భారత సైన్యం!

  • పాక్ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి
  • వెంటనే గుణపాఠం చెప్పిన భారత్
  • ఆర్టిలరీ గన్స్ తో టెర్రర్ క్యాంపులపై దాడులు
కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, ఈ ఉదయం వాస్తవాధీన రేఖ వెంబడి దాడులకు తెగబడి, ఇద్దరు జవాన్లను, ఓ పౌరుడిని బలిగొన్న పాక్ సైన్యానికి భారత జవాన్లు గుణపాఠం చెప్పారు. పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం ఆర్టిలరీ గన్స్ వాడుతూ దాడులు చేసింది. సరిహద్దులు దాటకుండానే, ఐదు నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే గన్స్ ను సైన్యం వాడింది. భారత సైన్యం జరిపిన దాడిలో పలు టెర్రర్ క్యాంపులు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఈ దాడులపై మరింత సమాచారం తెలియాల్సివుంది.
India
POK
Pakistan
Army
Guns
Terror Camps

More Telugu News