Ajinkya Rahane: సెంచరీ చేసి అవుట్ అయిన రహానే... డబుల్ సెంచరీ దిశగా రోహిత్ శర్మ!

  • రాంచీలో దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్
  • 115 పరుగులు సాధించి పెవీలియన్ కు చేరిన రహానే
  • 167 పరుగుల వద్ద కొనసాగుతున్న రోహిత్ శర్మ
రాంచీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో అజింక్యా రహానే సెంచరీ సాధించి, అవుట్ అయ్యాడు. ఓవర్ నైట్ స్కోర్ 224/3 నుంచి రెండో రోజు ఆటను ప్రారంభించిన రహానే, రోహిత్ ల జోడీ, సగటున ఓవర్ కు 4.5 పరుగుల చొప్పున సాధిస్తూ, దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారు.

ఈ క్రమంలో టెస్టుల్లో తన 11వ సెంచరీని పూర్తి చేసుకున్న రహానే 115 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో ఎండ్ లో పాతుకుపోయిన రోహిత్ శర్మ ప్రస్తుతం 167 పరుగుల స్కోరు వద్ద కొనసాగుతూ, మరో డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. రహానే అవుటైన తరువాత రవీంద్ర జడేజా వచ్చి రోహిత్ కు జత కలిశాడు. ప్రస్తుతం భారత స్కోరు 75.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 306 పరుగులు.
Ajinkya Rahane
Rohit Sharma
Century
South Afrika
India
Cricket
Ranchi

More Telugu News