Kurnool District: వైసీపీ నాయకుల వేధింపులు.. టీడీపీ నేత జయరామిరెడ్డి ఆత్మహత్యాయత్నం

  • కర్నూలు జిల్లాలో ఘటన
  • పురుగుల మందు తాగిన జయరామిరెడ్డి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేత
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని చిన్న గోనెహాల్‌కు చెందిన టీడీపీ నేత జయరామిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. జయరామిరెడ్డి ఆత్మహత్యాయత్నానికి వైసీపీ నాయకుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు అందాల్సి ఉంది.  
Kurnool District
adoni
Telugudesam
suicide

More Telugu News