Pro Kabaddi: ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్ విజేత బెంగాల్ వారియర్స్

  • ఫైనల్లో దబాంగ్ ఢిల్లీపై విజయం
  • 39-34తో ప్రత్యర్థిపై పైచేయి
  • లీగ్ లో తొలి టైటిల్ సాధించిన బెంగాల్
దేశంలో గ్రామీణ క్రీడగా ఎంతో పేరుగాంచిన కబడ్డీకి లీగ్ రూపం కల్పించి ప్రజలకు మరింత చేరువ చేసే ప్రయత్నమే ప్రొ కబడ్డీ లీగ్. గత ఆరు సీజన్లుగా ఎంతో విజయవంతం అయిన ప్రొ కబడ్డీ 7వ సీజన్ కూడా ముగిసింది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్ అద్భుత విజయం సాధించి టైటిల్ ఎగరేసుకెళ్లింది. టైటిల్ పోరులో బెంగాల్ వారియర్స్ 39-34తో దబాంగ్ ఢిల్లీ జట్టుపై జయభేరి మోగించింది. అహ్మదాబాద్ లోని ఈకేఏ ఎరీనాలో ఈ మ్యాచ్ జరిగింది. ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమయ్యాక బెంగాల్ వారియర్స్ విజేతగా నిలవడం ఇదే ప్రథమం. బెంగాల్ జట్టులో మహ్మద్ నబీబక్ష్ అమోఘంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
Pro Kabaddi
Bengal Warriors
Dabang Delhi

More Telugu News