Githamadhuri: ఆన్ లైన్ లో సందడి చేస్తున్న గీతామాధురి కుమార్తె ఫొటోలు

  • నామకరణం సందర్భంగా ఫొటోలు
  • ఆగస్టు 9న దాక్షాయణికి జన్మ ఇచ్చిన మాధురి
  • అందరి మదిని దోచేస్తున్న 'బ్లాక్ బస్టర్ బేబీ'
నేపథ్య గాయని గీతా మాధురి, నటుడు నందు తమ ముద్దుల కూతురుకు నామకరణం చేస్తూ తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. 'పక్కా లోకల్', 'టాప్ లేచిపోద్ది' వంటి మాస్ పాటలతో పాటు  సుమధురమైన తన గొంతుతో అనేక హిట్ పాటలను పాడి గీతా మాధురి అభిమానులను ఆకట్టుకుంది. నందును ప్రేమ వివాహం చేసుకున్న గీతా మాధురి ఆగస్టు 9న మాతృత్వపు మధురిమలను చవిచూసింది. ఇంతకీ పాప పేరేంటో తెలుసా 'దాక్షాయణి ప్రకృతి'. "నేనే... మీ గీతామాధురి, నందుల బ్లాక్ బస్టర్ బేబీని!" అంటూ దాక్షాయణి చెబుతున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చిన్నారి దాక్షాయణి ఫొటోలు ముద్దొస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.


Githamadhuri
Nandu
Tollywood
Dakshayani Prakruthi

More Telugu News