హుజూర్ నగర్ లో మేమే గెలుస్తాం... మంత్రి సత్యవతి రాథోడ్ ధీమా

19-10-2019 Sat 17:06
  • నియోజక వర్గ ప్రజలు తెరాస వైపే
  • అభివృద్ధి త్వరితం కావాలంటే మాకే ఓటేయండి
  • గిరిజనులు మమ్మల్నే నమ్ముతున్నారు

ఉప ఎన్నిక జరుగనున్న హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయ బావుటా ఎగురవేస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నియోజక వర్గ ప్రజలు తమవైపే ఉన్నారన్నారు. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సత్యవతి మీడియాతో మాట్లాడారు.

నియోజకవర్గంలో తెరాసకు ఆదరణ పెరిగిందని.. మమ్మల్ని చూసి కాంగ్రెస్, బీజేపీ కలవరానికి గురవుతున్నాయన్నారు. నియోజక వర్గంలో అభివృద్ధి వేగవంతం కావాలంటే సైదిరెడ్డిని గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ గెలుస్తుందన్న భ్రమలో ఉందన్నారు. గిరిజన తండాల్లోని ప్రజలు తమ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి చెప్పారు. తొలుత పద్మావతికి టికెట్ వద్దన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తిరిగి ఆమెకే అనుకూలంగా ప్రచారానికి దిగాడని ఎద్దేవా చేశారు.