'సైరా' విషయంలో నయనతార అసహనం

19-10-2019 Sat 11:49
  • భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'సైరా'
  • తమన్నా నటనకి ప్రశంసలు 
  • నయనతారలో అసంతృప్తి

తమిళంలో వరుస సినిమాలతో బిజీగా వున్న నయనతార, చిరంజీవి సరసన 'సైరా నరసింహారెడ్డి' సినిమా చేసింది. ఈ సినిమా కోసం నయనతార అందుకున్న పారితోషికం అక్షరాలా 6 కోట్లు అని వినికిడి. వివిధ భాషల్లో విడుదల చేస్తుండటం వలన, నయనతార డిమాండ్ కి తగినట్టుగానే అడిగినంత పారితోషికం ముట్టజెప్పారట.

చిరంజీవి కెరియర్లో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకునే ఈ సినిమాను కూడా నయనతార ప్రత్యేకంగా భావించలేదు. ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు. దాంతో ప్రతి వేదికపై తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలవడం .. అంతా ఆమె పాత్రను ప్రశంసించడం జరిగింది. ఎక్కడా ఎవరూ తన గురించిన ప్రస్తావన తీసుకురాకపోవడం నయనతారకి అసహనాన్ని .. అసంతృప్తిని కలిగించిందని అంటున్నారు. ఇక తమన్నా పాత్రకి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం వల్లనే నయనతార ప్రమోషన్స్ కి రాలేదనేది ఆమె సన్నిహితుల వైపు నుంచి వినిపిస్తోన్నమాట.