Srikakulam District: పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు కలమట వెంకటరమణ అరెస్టు
- గ్రామ సచివాలయానికి రంగులు వేస్తుంటే అడ్డుకున్నారని ఫిర్యాదు
- రమణతోపాటు మొత్తం 19 మందిపై కేసు నమోదు
- బెయిలు మంజూరు చేసిన స్థానిక కోర్టు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు కలమట వెంకటరమణను పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఆయన స్వగ్రామం కొత్తూరు మండలం మాతలలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనానికి రంగులు వేస్తుంటే అడ్డుకుని, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న అభియోగంపై రమణతోపాటు మొత్తం 19 మందిపై కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
మాతల గ్రామ వలంటీర్ బూరాడ నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న కలమట రమణ ఇంటికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు తమ వాహనంలో ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం కొత్తూరులోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు.
కేసు విచారించిన న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తుపై వారికి బెయిలు మంజూరు చేశారు. అరెస్టయిన వారిలో మాజీ ఎమ్మెల్యేతోపాటు కలమట సాగర్, రేగేటి మోహనరావు, మాతల గాంధీ, గండివలస తేజేశ్వరరావు, రేగేటి సూర్యం, కలమట చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.