KTR: ఆర్థిక వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది: కేటీఆర్

  • హెచ్ఐసీసీలో ఓ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్
  • రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతోందని వ్యాఖ్యలు
  • యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ఎంతో వేగంగా జరుగుతోందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్థిక వృద్ధిలో తెలంగాణ రాష్ట్రానిది అగ్రస్థానమని అన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా 13 లక్షల మందికి ఉద్యోగాలు చూపించామని, యువతకు అన్ని విధాలా ఉపాధి అవకాశాలు ఇస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రైవేటు రంగంలోనే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతున్నాయని చెప్పారు.
KTR
Telangana
TRS
HICC

More Telugu News