విజయ్ 'విజిల్' రిలీజ్ డేట్ ఖరారు

18-10-2019 Fri 18:01
  • క్రీడా నేపథ్యంలో సాగే 'బిగిల్'
  • తెలుగు టైటిల్ గా 'విజిల్'
  • రెండు భాషల్లోను ఒకే రోజున విడుదల

విజయ్ కథానాయకుడిగా అట్లీ కుమార్ దర్శకత్వంలో 'బిగిల్' రూపొందింది. ఫుట్ బాల్ క్రీడా నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాలో, విజయ్ జోడీగా నయనతార నటించింది. దీపావళి కానుకగా తమిళంలో ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేస్తున్నారు.

అదే రోజున ఈ సినిమాను తెలుగులో 'విజిల్' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. మహేశ్ కోనేరు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో రాజప్ప అనే మాస్ పాత్రలోను .. మైఖేల్ అనే ఫుట్ బాల్ కోచ్ పాత్రలోను విజయ్ కనిపించనున్నాడు. గతంలో అట్లీ కుమార్ - విజయ్ కాంబినేషన్లో వచ్చిన 'తెరి' .. 'మెర్సల్' ఘన విజయాలను సొంతం చేసుకోవడంతో, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడుతుందేమో చూడాలి మరి.