Kodandaram: రేపటి బంద్ ను విజయవంతం చేయండి: కోదండరాం పిలుపు

  • ప్రభుత్వ మొండి వైఖరితో తెలంగాణలో రాజ్యాంగ సంక్షోభం వస్తుంది
  • కేసీఆర్ మొండి పట్టును వీడాలి
  • ఆర్టీసీ కార్మికుల సమ్మెను తక్కువ అంచనా వేయవద్దు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెను సీఎం కేసీఆర్ తక్కువ అంచనా వేస్తూ.. చిన్న చూపు చూస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్ కు ప్రజలందరూ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సకల జనుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను గుర్తుచేసుకోవాలని కేసీఆర్ నుద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉందని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. తెరాస నేతలు కూడా కొందరు తమతో టచ్ లో ఉన్నారన్నారు. వ్యాపారస్తులు ఇతర సంస్థలు బంద్ లో పాల్గొనాలని కోరారు.

  • Loading...

More Telugu News