Reliance: రిలయన్స్ సరికొత్త బెంచ్ మార్క్ నమోదు!

  • రూ.9 లక్షల కోట్లను మించి మార్కెట్ క్యాపిటలైజేన్ సాధించిన తొలి కంపెనీగా రికార్డు
  • గత ఏడాది కూడా రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన తొలి కంపెనీగా ఆర్ఐఎల్    
  • మధ్యాహ్నానికి 52 వారాల గరిష్ఠానికి షేర్ విలువ
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ ఐఎల్)  మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ శుక్రవారం నాటికి రూ.9 లక్షల కోట్లను దాటి సరికొత్త బెంచ్ మార్క్ కు చేరి రికార్డు సృష్టించింది. గత ఏడాది ఆగస్ట్ లో కూడా ఆర్ఐఎల్ సంస్థ రూ.8 లక్షల కోట్ల బెంచ్ మార్క్ కు చేరిన తొలి కంపెనీగా నిలిచింది. ఉదయం 11.50 గంటలకే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,00,317.35 కోట్లకు చేరింది. ఈరోజు కంపెనీ రెండో త్రైమాసిక పలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో కంపెనీ షేర్ విలువ కూడా పైకెగిసింది. కంపెనీ షేర్ విలువ కూడా 52 వారాల గరిష్ఠానికి ( రూ.1,428)  చేరింది. అంతకు ముందు ఈ షేర్ 1,420 వద్ద ట్రేడయింది.
Reliance
RIL
new benchmark
first company

More Telugu News