Revanth Reddy: కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులపై కన్నేశారు: రేవంత్ రెడ్డి

  • కార్మికుల సమ్మెను పట్టించుకోవడం లేదు
  • ఆత్మహత్యలు చేసుకోవద్దని కార్మికులకు ఉద్బోధ
  • రేపటి బంద్ లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొంటాయి

తెలంగాణలో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. దీనిపై రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్  వైఖరిని తూర్పారబట్టారు. 85 వేల కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్నేశారన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచిస్తూ.. ప్రభుత్వంతో పోరాడి తమ డిమాండ్లను సాధించుకోవాలన్నారు. రేపటి బంద్ లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొంటాయని పేర్కొన్నారు.

More Telugu News