ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ!
- వడ్డీ రేటు పెంపునకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం
- దీపావళి పర్వదినానికి ముందుగానే జమ
- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎమ్ఎస్ పంపితే బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు
ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లో కానీ, ఉమాంగ్ యాప్ ద్వారా ఆన్లైన్లో కానీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ వెబ్సైట్ www.epfindia.gov.in కు లాగిన్ అయి, ఎడమ వైపు ఉండే అవర్ సర్వీసెస్ పై క్లిక్ చేయాలి. అనంతరం ఫర్ ఎంప్లాయిస్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ పాస్‌బుక్‌పై క్లిక్ చేసిన తర్వాత యూఏఎన్ నెంబరు, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. దీంతో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే, మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 77382 99899 కు ఎస్ఎమ్ఎస్ పంపినా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.