Prasad: ఐమ్యాక్స్ ప్రసాద్ అర్ధాంగి విజయలక్ష్మి కన్నుమూత... పూర్తయిన అంత్యక్రియలు

  • నిద్రలోనే గుండెపోటుకు గురైన విజయలక్ష్మి
  • మహాప్రస్థానంలో అంత్యక్రియలు
  • సినీ ప్రముఖుల విచారం
ప్రసాద్ గ్రూప్ సంస్థల అధినేత, ఐమ్యాక్స్ ప్రసాద్ గా పేరుపొందిన సినీ నిర్మాత అక్కినేని రమేశ్ ప్రసాద్ కు సతీవియోగం కలిగింది. ఆయన అర్ధాంగి విజయలక్ష్మి గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 77 సంవత్సరాలు. విజయలక్ష్మి మృతి పట్ల సినీ ప్రముఖులు, సన్నిహితులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె నిద్రలోనే గుండెపోటుకు గురైనట్టు డాక్టర్లు చెప్పారు. ఈ సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. ప్రసాద్, విజయలక్ష్మి దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు.
Prasad
IMAX
Vijayalakshmi
Hyderabad
Tollywood

More Telugu News