Aiden Markrum: అవుటైన కోపంలో గోడను కొట్టి గాయపడిన సఫారీ ఓపెనర్... మూడో టెస్టుకు దూరం

  • రెండో టెస్టులో మార్ క్రమ్ పేలవ ఆటతీరు
  • రెండో ఇన్నింగ్స్ లో ఇషాంత్ బంతికి అవుట్
  • టీవీ రీప్లేలో నాటౌట్ గా తేలిన వైనం
  • కోపం భరించలేకపోయిన మార్ క్రమ్
తన కోపమె తన శత్రువు అని ఊరికే అనలేదు! భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు విజయం కోసం ఆపసోపాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెస్టు సిరీస్ ను 0-2తో కోల్పోయారు. అయితే రెండో టెస్టు సందర్భంగా సఫారీ ఓపెనర్ ఐడెన్ మార్ క్రమ్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ పేలవంగా అవుటయ్యాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో ఇషాంత్ శర్మ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. టీవీ రీప్లేలో అది నాటౌట్ అని తేలడంతో కోపం భరించలేక డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న గోడను బలంగా గుద్దాడు.

దాంతో మార్ క్రమ్ చేతికి బలమైన గాయం అయింది. మణికట్టులో పగులు రావడమే కాదు, కొన్ని చేతివేళ్ల ఎముకలు చిట్లినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. దాంతో శనివారం ప్రారంభమయ్యే మూడో టెస్టులో మార్ క్రమ్ ఆడబోవట్లేదని దక్షిణాఫ్రికా వర్గాలంటున్నాయి. మార్ క్రమ్ చికిత్స కోసం స్వదేశానికి పయనం కానున్నట్టు సమాచారం.
Aiden Markrum
South Africa
India
Cricket
Pune
Ranchi

More Telugu News