Jagan: మీ చేతగాని పాలన గురించి రాసిన జర్నలిస్టులను చంపేస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు: జగన్ పై లోకేశ్ ధ్వజం

  • సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు
  • పాలనపై జగన్ నియంత్రణ కోల్పోయారంటూ వ్యాఖ్యలు
  • జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రాష్ట్ర పాలనపై నియంత్రణ కోల్పోయిన జగన్ ఓ నియంతలా మారారని ఆరోపించారు. మీరు చేస్తున్నది అసమర్థ పాలన అని మీరే కేబినెట్ సాక్షిగా అంగీకరించి, అదే విషయాన్ని జర్నలిస్టులు రాస్తే వాళ్లను చంపేస్తారా? అని నిలదీశారు. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న పాత్రికేయులను చంపేస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని లోకేశ్ ట్విట్టర్ లో ధ్వజమెత్తారు.

మీ తుగ్లక్ పాలన గురించి ప్రశ్నిస్తే ప్రజలపైనా ఇలాగే కేసులు పెడతారా వైఎస్ జగన్ గారూ? అంటూ నిలదీసి అడిగారు. పిచ్చిముదిరిన తరహాలో మీరిలా కేసులు పెడుతూ పోతే రాష్ట్రంలో జైళ్లు సరిపోవు అంటూ విమర్శించారు. నిజాయతీ ఉంటే కేసులు పెట్టకుండా ఆత్మపరిశీలన చేసుకోవాలని లోకేశ్ హితవు పలికారు.

More Telugu News