Kalki: కల్కి ఆశ్రమంలో అక్రమాలు బట్టబయలు... కోట్లాది రూపాయలు, కీలక పత్రాలు స్వాధీనం

  • నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు
  • సోదాలు నిర్వహిస్తున్న 400 మంది అధికారులు
  • ఇప్పటి వరకు రూ. 33 కోట్ల స్వాధీనం

కల్కి భగవాన్ కు చెందిన ప్రధాన ఆశ్రమంతో పాటు, పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు రెండో రోజు సోదాలు జరుపుతున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో తనిఖీలను నిర్వహిస్తున్నారు. మొత్తం 400 మంది అధికారులు 16 బృందాలుగా విడిపోయి సోదాలను నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున డబ్బు బయటపడుతోంది. ఇప్పటి వరకు రూ. 33 కోట్లను అధికారులు గుర్తించారు. ఇందులో 9 కోట్ల విదేశీ కరెన్సీ కూడా ఉంది. దీంతో పాటు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో కంప్యూటర్లను సీజ్ చేశారు. చెన్నై, బెంగళూరుల్లో భారీగా భూములు కొన్నట్టు గుర్తించారు. ఆఫ్రికా, ఖతార్ దేశాల్లో కూడా ఆస్తులు ఉన్నట్టు కనుగొన్నారు.

More Telugu News