Crime News: పట్టపగలు నడిరోడ్డుపై హత్య... ప్రాణాలు కోల్పోయిన డ్రిల్‌ మాస్టర్‌

  • గుర్తు తెలియని వ్యక్తుల దాడి
  • ఏలూరు మినీ బైపాస్‌ రోడ్డులో ఘటన
  • బంగారం, నగదుతో పరారీ
పట్టపగలు నడిరోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు ఓ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడిని హత్య చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మినీ బైపాస్‌ రోడ్డులో ఈ దారుణం చోటు చేసుకుంది. నాగరాజు అనే వ్యాయామ ఉపాధ్యాయుడు ఈ రోడ్డులో వెళ్తుండగా అటకాయించిన దుండగులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. అతని వద్ద ఉన్న 15 కాసుల బంగారం, రూ.2 లక్షలను కూడా ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Crime News
West Godavari District
eluru
drill master murdered

More Telugu News