Tv9: హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్

  • అవన్నీ అక్రమ కేసులు..కొట్టివేయాలంటూ పిటిషన్ 
  • నవంబర్ 2కు విచారణ వాయిదా వేసిన హైకోర్టు
  • బెయిల్ పిటిషన్ పై త్వరలో విచారణ

టీవీ 9లో రూ.18 కోట్ల నిధుల అవకతవకల కేసులో ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని తనపై నమోదు చేసిన కేసులు, ఎఫ్ఐఆర్ లను కొట్టి వేయాలని రవిప్రకాశ్ కోర్టును అభ్యర్థించారు. పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణను నవంబర్ 2కు వాయిదా వేస్తూ అప్పటివరకు రవిప్రకాశ్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.  

ప్రస్తుతం రవిప్రకాశ్ హైదరాబాద్, చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్నారు. రవిప్రకాశ్ ను ప్రశ్నించడానికి తమ కస్టడీకి ఇవ్వాలని బంజారా హిల్స్ పోలీసులు కోరగా, కోర్టు అందుకు తిరస్కరించింది. మరోవైపు రవిప్రకాశ్ తనకు బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేసుకోగా దానిపై విచారణ జరగాల్సి ఉంది.

More Telugu News