andhra Jyothy: జర్నలిస్ట్ సత్యనారాయణను హత్య చేయడం చాలా ఘోరం: కన్నా లక్ష్మీనారాయణ

  • అన్నవరంలో దారుణ హత్యకు గురైన ఆంధ్రజ్యోతి విలేకరి
  • హంతకులను తక్షణమే అరెస్ట్ చేయాలని కన్నా డిమాండ్
  • శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోందంటూ విమర్శ

ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణ హత్య పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సత్యనారాయణ హత్య చాలా దారుణ, హేయమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాంటి వ్యక్తి పాత్రికేయుడని... అలాంటి పాత్రికేయుడిని పాశవికంగా హత్య చేయడం చాలా ఘోరమని అన్నారు. హంతకులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని విమర్శించారు. సత్యనారాయణ కుటుంబసభ్యులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సత్యనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనను నరికి చంపారు. తొండంగి అర్బన్ రిపోర్టర్‌గా ఆయన పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News