Narendra Modi: మోదీ వ్యాఖ్యలతో భావోద్వేగానికి లోనైన రెజ్లర్ బబితా ఫొగాట్

  • ఛార్ఖీ దాద్రి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బబిత
  • రెజ్లర్ బబితా ఫొగట్ కోసం మోదీ ప్రచారం
  • అవకాశాలు ఇస్తే అమ్మాయిలు సత్తా చాటుతారని వ్యాఖ్య

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. హర్యానాలోని ఛార్ఖీ దాద్రిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ పార్టీ విదేశాల్లో దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీని శిక్షించాలని పిలుపునిచ్చారు. మీకు ఇష్టం వచ్చిన రీతిలో తనను తిట్టినా భరిస్తానని... కానీ, భారత్ కు వెన్నుపోటు పొడవకండని కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యానించారు. కావాలంటే థాయ్ లాండ్, హాంకాంగ్, వియత్నాం మొదలైన దేశాల నుంచి తిట్లను దిగుమతి చేసుకుని తనను తిట్టండని చెప్పారు. దేశ ప్రతిష్ఠను మాత్రం దిగజార్చవద్దని కోరారు.

ఛార్ఖీ దాద్రి స్థానం నుంచి రెజ్లర్ బబితా ఫొగాట్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమె జీవిత చరిత్ర ఆధారంగానే అమీర్ ఖాన్ చిత్రం 'దంగల్' తెరకెక్కింది. ఈ సందర్భంగా బబిత గురించి మోదీ మాట్లాడుతూ, 'దంగల్' సినిమాను చూశానని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ మధ్యే తనతో చెప్పారని తెలిపారు. ఆ విషయం విని తాను ఎంతో గర్వపడ్డానని... అవకాశం ఇస్తే ఆడపిల్లలు వారి సత్తా చాటుతారని అన్నారు. మోదీ మాటలతో బబిత కాసేపు భావోద్వేగానికి లోనయ్యారు.

  • Loading...

More Telugu News