pema khandu: పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు.. సాహసం చేసిన అరుణాచల్‌ప్రదేశ్ సీఎం

  • 122 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించిన సీఎం
  • రాష్ట్రం వైపు పర్యాటకులను ఆకర్షించేందుకే
  • 8 గంటలకు మొదలై 10:30 గంటలకు ముగిసిన ప్రయాణం
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ సాహసం చేశారు. బైక్‌పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బైక్ రైడింగ్, సాహస క్రీడలకు ప్రసిద్ధి గాంచిన రాష్ట్రంలోని పాసిఘాట్‌ వైపు పర్యాటకుల్ని ఆకర్షించేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 బైక్‌పై యుంకియాంగ్ నుంచి పాసిఘాట్ వరకు 122 కిలోమీటర్లు ప్రయాణించి పర్యాటకుల దృష్టిని ఆకర్షించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ నెల 13న ఉదయం 8 గంటలకు యుంకియాంగ్ నుంచి తన ప్రయాణం మొదలైందని, 10:30 గంటలకు పాసిఘాట్ విమానాశ్రయానికి చేరుకున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. పెమాఖండా బైక్ రైడింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
pema khandu
Arunachal Pradesh
tourism

More Telugu News