‘రివర్స్’తో డబ్బులు మిగిలితే మిగలొచ్చు కానీ, చేసిన పని ఎలాంటిదో ఆలోచించుకోవాలి?: జేసీ దివాకర్ రెడ్డి
- గత కాంట్రాక్టర్లు డబ్బులు తింటే తినొచ్చు
- ‘పోలవరం’ పనులు ఆపడం కరెక్టు కాదు
- పొత్తుకు ద్వారాలు మూయడానికి, తెరవడానికి కన్నా ఎవరు?
ఏపీలో మార్పును కోరుకున్న ప్రజలు జగన్ ని గెలిపించారని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో ముక్కూ మొహం తెలియని వైసీపీ అభ్యర్థులకూ ఓట్ల మెజార్టీ వేలల్లో వచ్చిందని, దానికి కారణం మోదీ మంత్ర దండమేనని వ్యాఖ్యానించారు. జగన్ కు మంచీచెడూ చెప్పేవారు లేరని, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటారని విమర్శించారు. జగన్ మంచీ చెడూ రెండూ చేస్తున్నారన్న జేసీ, జగన్ పాలన గురించి చెప్పాలంటే మరో ఆరు నెలలు గడవాలని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఆయన విమర్శలు చేశారు. పొత్తుకు ద్వారాలు మూయడానికి, తెరవడానికి కన్నా ఎవరు? అని ప్రశ్నించారు.