Krishnavamshi: చాలా కాలం తరువాత కృష్ణవంశీ మూవీలో రమ్యకృష్ణ

  • కొత్త కథను సిద్ధం చేసుకున్న కృష్ణవంశీ  
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
  • 15 ఏళ్ల తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో
తెలుగు తెరపై నిన్నటి తరం కథానాయికగా రమ్యకృష్ణ ఒక వెలుగు వెలిగారు. ఆ తరువాత ఆమె తన వయసుకి తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 'బాహుబలి' సినిమాలో ఆమె పోషించిన 'శివగామి' పాత్ర ఆమె స్థాయిని పెంచేసింది. ఇప్పుడు దర్శక నిర్మాతలు రమ్యకృష్ణను తమ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా .. అదనపు బలంగా భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే త్వరలో రమ్యకృష్ణ .. కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. 'నక్షత్రం' తరువాత గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ, ఒక విభిన్నమైన కథతో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాడట. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఆయన రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నాడని అంటున్నారు. అదే నిజమైతే 'శ్రీఆంజనేయం' తరువాత, అంటే 15 ఏళ్ల తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ చేసే సినిమా ఇదే అవుతుంది.
Krishnavamshi
Ramya Krishna

More Telugu News