Karthi: కార్తీ 'ఖైదీ' విడుదల తేదీ ఖరారు

  • కార్తీ తాజా చిత్రంగా రూపొందిన 'ఖైదీ'
  • యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • తెలుగు హక్కులను సొంతం చేసుకున్న రాధామోహన్

కార్తీ కథానాయకుడిగా తమిళంలో 'ఖైదీ' సినిమా నిర్మితమైంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో, పారిపోయిన ఖైదీగా కార్తీ కనిపించనున్నాడు. ఆయన ఎందుకు ఖైదీగా మారవలసి వచ్చిందనే అంశం నేపథ్యంలో ఈ సినిమా కథ ఆసక్తికరంగా కొనసాగనుంది.

ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా విడుదల తేదీపై అంతా దృష్టి పెట్టారు. తెలుగులో ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న కె.కె.రాధామోహన్, ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ .. రొమాన్స్ .. పాటలు లేవని ముందుగానే చెప్పేసి విడుదల చేస్తుండటం విశేషం.

More Telugu News