Nimmala: అది ‘రైతు భరోసా’ కాదు, రైతులను మోసం చేసే పథకం: టీడీపీ నేత నిమ్మల రామానాయుడు

  • వైఎస్ జగన్ నాడు చెప్పిందొకటి.. నేడు చేసింది మరోటి
  • కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఈ పథకం కింద ఇస్తారా?
  • ‘రైతు రుణమాఫీ’ని యథావిధిగా ప్రవేశపెట్టాలి

ఏపీలో రేపటి నుంచి ప్రారంభం కానున్న వైఎస్సార్ రైతు భరోసా పథకంపై టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు. ఏలూరులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ నాడు ఎన్నికల ప్రచార సమయంలో ఒకటి చెప్పి, అధికారంలోకి వచ్చాక మరోటి చేస్తున్నారని మండిపడ్డారు. ‘వైఎస్సార్ రైతు భరోసా కాదు వైఎస్సార్ రైతు మోసం’ అని ఆరోపించారు.

సీఎం జగన్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య పదిహేను లక్షలకు పైబడి ఉందని, రైతు భరోసా పథకం కింద కేవలం నలభై వేల మంది లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేశారని, ఇది మోసం కాదా? అని ప్రశ్నించారు. రైతులకు కేంద్రం ఇస్తున్న ఆరు వేల రూపాయలను కూడా కలిపి ఈ పథకం కింద ఇస్తున్నట్టు వైసీపీ చెప్పలేదని, ఆ విధంగా చెప్పినట్టు ప్రభుత్వం నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కేంద్రం ఇస్తున్న రాయితీతో కలిపి ఈ పథకం కింద ప్రతి రైతుకు రూ.18,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ పథకాన్ని యథావిధిగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News