Team India Women: కోహ్లీసేనకు తీసిపోని అమ్మాయిలు... సఫారీలను క్వీన్ స్వీప్ చేశారు!

  • మూడు వన్డేల సిరీస్  3-0తో కైవసం
  • చివరి వన్డేలో 6 పరుగుల తేడాతో గెలుపు
  • స్వల్ప స్కోర్ల మ్యాచ్ లో టీమిండియా మహిళల అద్భుత ప్రతిభ

భారత మహిళల క్రికెట్ బీసీసీఐలో విలీనం అయిన తర్వాత అమ్మాయిల జట్టు ఆటతీరులో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో మన అమ్మాయిలు సొంతగడ్డపైనే కాకుండా విదేశాల్లోనూ మెరుగ్గా రాణిస్తున్నారు. తాజాగా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత మహిళల జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ వడోదరలో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా మహిళలు 6 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేయడమే కాకుండా 3-0తో సిరీస్ ను తుడిచిపెట్టారు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 45.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైనా, బౌలర్ల ప్రతిభతో మ్యాచ్ మన చేతుల్లోకొచ్చింది. లక్ష్యఛేదనలో సఫారీలు 140 పరుగులకే చాప చుట్టేశారు. ఏక్తా బిస్త్ 3, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ చెరో 2 వికెట్లు తీసి ప్రత్యర్థి వెన్నువిరిచారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పురుషుల జట్టు కూడా భారత్ లోనే పర్యటిస్తుండగా, మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ 2-0తో కోహ్లీసేన వశమైంది.

More Telugu News