Pilli Subhash Chandrabose: రాష్ట్రంలో కౌలుదారుల గుర్తింపునకు కొందరు రైతులు ముందుకు రావట్లేదు: మంత్రి సుభాష్ చంద్రబోస్

  • కౌలుదారుల కోసం చట్టం రూపొందించామన్న మంత్రి
  • భూ రికార్డుల్లో కౌలుదారు పేరు రికార్డు కాదని వెల్లడి
  • కౌలుదారు దెబ్బతింటే నష్టపోయేది రైతేనంటూ వ్యాఖ్యలు
ఏపీలో కౌలుదారులను గుర్తించి లబ్ది చేకూర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. కౌలుదారుల హక్కులు కాపాడేలా చట్టం కూడా రూపొందించామని వెల్లడించారు. భూ రికార్డుల్లో కౌలుదారు పేరు రికార్డు కాదని స్పష్టం చేశారు. అయితే, కౌలుదారుల గుర్తింపునకు కొందరు రైతులు ముందుకు రావడంలేదని అన్నారు. కౌలుదారు చట్టం సరిగాలేక ఉభయ గోదావరి జిల్లాల రైతులు వలస వెళుతున్న పరిస్థితి ఏర్పడిందని మంత్రి వెల్లడించారు. కౌలుదారులు దెబ్బతింటే మొదట నష్టపోయేది రైతేనని స్పష్టం చేశారు.
Pilli Subhash Chandrabose
Andhra Pradesh
YSRCP

More Telugu News