Ganguly: బీసీసీఐ అధ్యక్ష పదవికి ముంబయిలో నామినేషన్ దాఖలు చేసిన గంగూలీ

  • నామినేషన్లకు నేడే తుది గడువు 
  • బీసీసీఐ కార్యవర్గం ఎన్నికలు అక్టోబరు 23న 
  • బ్రిజేశ్ కు ఐపీఎల్ చైర్మన్ పదవి!
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టడం లాంఛనమే. కొద్దిసేపటి క్రితమే ముంబయిలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో ఉన్నది గంగూలీ ఒక్కరే. బీసీసీఐ కార్యవర్గం ఎన్నికలు అక్టోబరు 23న నిర్వహించనున్నారు. నామినేషన్లకు అక్టోబరు 14 తుది గడువుగా విధించారు.  

ఇక, ఇతర పదవుల విషయానికొస్తే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జయ్ షా బీసీసీఐ కార్యదర్శి పదవికి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ కోశాధికారి పదవికి, కేరళ క్రికెట్ సంఘం అధ్యక్షుడు జయేశ్ జార్జ్ సంయుక్త కార్యదర్శి పదవి కోసం నామినేషన్లు దాఖలు చేశారు. ఇక, గంగూలీ రాకతో రేసు నుంచి తప్పుకున్న బ్రిజేశ్ పటేల్ ను ఐపీఎల్ చైర్మన్ గా చేసేందుకు పావులు చకచకా కదులుతున్నాయి
Ganguly
BCCI
President

More Telugu News