ayodya: అయోధ్యలో ఆంక్షలు... 144 సెక్షన్‌ విధింపు

  • సుప్రీంలో రామ జన్మభూమి కేసు విచారణ నేపథ్యం
  • దసరా సెలవుల తర్వాత  నేటి నుంచి విచారణ
  • ఈనెల 17న తీర్పు

అయోధ్యలోని వివాదాస్పద రామాలయ నిర్మాణం అంశంపై సుప్రీం కోర్టులో నడుస్తున్న వ్యాజ్యంపై నేటి నుంచి మళ్లీ విచారణ ప్రారంభంకానుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అయోధ్యలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. దసరా సెలవుల అనంతరం ఈరోజు 38వ రోజు విచారణ ప్రారంభమవుతుంది. మధ్యవర్తిత్వం విఫలమైన నేపధ్యంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 6 నుంచి కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే. మధ్యలో దసరా సెలవులు రావడంతో కొన్నాళ్లు విచారణకు బ్రేక్‌ పడింది.

ఈనెల 16తో హిందూ వర్గాల వాదనలు ముగించాలని అత్యున్నత న్యాయ స్థానం నిర్ణయించింది. మరుసటి రోజు ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ఇక అదే రోజున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ పదవీ విరమణ కూడా చేయనున్నారు.

అతి సున్నితమైన ఈ కేసులో విచారణ చివరి దశకు చేరడం, తీర్పు వెలువడనుండడంతో ఆంక్షలు విధించామని, డిసెంబరు 10 వరకు ఆంక్షలు కొనసాగుతాయని అయోధ్య జిల్లా కలెక్టర్ (మేజిస్ట్రేట్) తెలిపారు.

More Telugu News