Telangana: తెలంగాణలో దసరా సెలవుల పొడిగింపుపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం!

  • సమ్మె కారణంగా ఈ నెల 19 వరకు సెలవుల పొడిగింపు
  • రేపటి నుంచి రావాలంటున్న ప్రైవేట్ విద్యా సంస్థలు
  • ఈ మేరకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు సందేశాలు 

టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మె కారణంగా పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు పొడిగిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈ నెల 19 వరకు పొడిగించిన దసరా సెలవులు వర్తిస్తాయి. అయితే, ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం రేపటి నుంచి పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తామని, తరగతులకు హాజరుకావాలని తమ విద్యార్థులకు సందేశాలు పంపారు. ఈ క్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. సెలవుల పొడిగింపు ఉత్తర్వులు పాటించని విద్యా సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని విద్యా శాఖ హెచ్చరించింది.

ఇదిలా ఉండగా, దసరా సెలవుల పొడిగింపు ఉత్తర్వులు గురుకులాలకు వర్తించవని రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపటి నుంచి తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

More Telugu News