Mahesh Babu: విదేశాల నుంచి వస్తూ.. ఫ్లయిట్ లో నుంచి మహేశ్ బాబు ట్వీట్!

  • 'సరిలేరు నీకెవ్వరు' షూటింగుకి బ్రేక్ 
  • భార్యాబిడ్డలతో అక్కడే సందడి 
  •  దసరా సెలవులు పూర్తికావడంతో తిరుగు ప్రయాణం
విదేశాల్లో విహరించడమంటే మహేశ్ బాబుకి ఎంతో ఇష్టం. అందువల్లనే ఆయన ప్రతి సినిమాకి ముందు .. ఆ తరువాత కూడా ఫ్యామిలీతో కలిసి విదేశాలకి వెళ్లి వస్తుంటాడు. ఇక పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు షూటింగుకు బ్రేక్ ఇచ్చేసి మరీ ఆయన విదేశాలకి బయల్దేరుతూ ఉంటాడు. అలాగే ఈ సారి దసరా సెలవులకి ఆయన భార్యాబిడ్డలతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లాడు. అక్కడ తాము సరదాగా సందడి చేసే ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నాడు.దసరా సెలవులు పూర్తికావడంతో వాళ్లంతా స్విట్జర్లాండ్ నుంచి హైదరాబాద్ కి బయల్దేరారు. ఆ సమయంలో గౌతమ్ తో తీసిన సెల్ఫీని మహేశ్ షేర్ చేస్తూ, 'బ్యాక్ టు వర్క్ అండ్ స్కూల్' అని పోస్ట్ చేశాడు. అలాగే నమ్రతతో కలిసి పొలరాయిడ్ కెమెరాతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ, 'ఈ ఫొటో తరువాత నేను పొలరాయిడ్ అభిమానిగా మారిపోయాను. 42 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తున్నాము .. ఇంటికి తిరిగి వచేస్తున్నాము" అని పోస్ట్ చేశాడు.
Mahesh Babu
Namratha

More Telugu News