Telugudesam: 21, 22 తేదీల్లో టీడీపీ శ్రీకాకుళం జిల్లా సమీక్ష : పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు

  • హాజరుకానున్న పార్టీ అధినేత చంద్రబాబు
  • నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై విశ్లేషణ
  • అధికార పక్షం తీరుపై ధ్వజం
రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సమీక్షలు కొనసాగిస్తున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 21, 22 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు తెలిపారు. ఈరోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రోజులపాటు జిల్లా కేంద్రంలో బస చేయనున్న చంద్రబాబు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితిపై ఆరా తీస్తారని తెలిపారు. ఒక్కో నియోజక వర్గంలోని నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించి గత ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషించనున్నారని వివరించారు.

ఈ సందర్భంగా కళా వెంకటరావు అధికార పార్టీ తీరుపై ధ్వజమెత్తారు. విపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా అధికార పార్టీ తీరు ఉందని విమర్శించారు. ఇసుక కొరతతో నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారని, బోటు ప్రమాదంపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.
Telugudesam
reviews
kalavenkatarao
Chandrababu
Srikakulam District

More Telugu News