Tamannah: మళ్లీ పుంజుకుంటోన్న తమన్నా

  • తమన్నాకి తగ్గుతూ వచ్చిన అవకాశాలు 
  • 'ఎఫ్ 2' హిట్ తో మళ్లీ గాడిలో పడిన కెరియర్ 
  • 'సైరా' విజయం తరువాత పెరుగుతున్న అవకాశాలు
తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ డమ్ ను అందుకున్న తమన్నా, బాలీవుడ్లోను తన జోరు చూపించడానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు. బాలీవుడ్ సంగతి అలా ఉంచితే తెలుగు .. తమిళ భాషల్లోను కొత్త కథనాయికల పోటీ కారణంగా ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వచ్చిన 'ఎఫ్ 2' ఆమెకి ఎంతో రిలీఫ్ ను ఇచ్చింది. 'సైరా' వంటి భారీ సినిమాలో ఆమెకి అవకాశం రావడం .. ఆ పాత్ర ఆమెకి ఎంతో గుర్తింపును తీసుకురావడం జరిగింది.

ఈ సినిమాలో నయనతార పాత్రకంటే తమన్నా పాత్ర ఎక్కువ ప్రభావం చూపడం, ప్రమోషన్స్ లో నయనతార ఎక్కడా కనిపించకపోగా, తమన్నా చురుకుగా పాల్గొనడం జరిగింది. దాంతో మెగా ఫ్యామిలీ నుంచి మెగా అభిమానుల నుంచి తమన్నా మంచి మార్కులు కొట్టేసింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రశంసల కారణంగా తమన్నాకి మళ్లీ వరుస అవకాశాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సీనియర్ స్టార్ హీరోల సరసన ఆమెను ఎంపిక చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నట్టుగా సమాచారం.
Tamannah

More Telugu News