Narendra Modi: నరేంద్ర మోదీకి జిన్ పింగ్ ఇచ్చే ఆ బహుమతి ఏంటో మాత్రం అత్యంత సీక్రెట్!

  • చైనా పర్యటనలో జిన్ పింగ్ కు కానుకలిచ్చిన మోదీ
  • మోదీ కోసం అరుదైన కానుక తెచ్చిన జిన్ పింగ్
  • నేడు బహూకరించనున్న చైనా అధ్యక్షుడు
ఏ దేశాధి నేత అయినా, మరో దేశానికి పర్యటనకు వెళ్లినప్పుడు, అక్కడి అధినేతకు బహుమతులు తీసుకెళ్లి ఇస్తుంటారు. ఇటీవల చైనాలో పర్యటించిన నరేంద్ర మోదీ, జిన్ పింగ్ కు బీజింగ్ లో ప్రత్యేక బహుమతులను అందించారు కూడా. ఇక జిన్ పింగ్ కూడా మోదీకి బహూకరించేందుకు ఒక బహుమతిని తెచ్చారు.

అయితే, ఆ బహుమతి ఏంటో ఇంతవరకూ ఒక్క లీక్ కూడా బయటకు రాలేదు. ఈ విషయంలో చైనా అధికారులు కూడా సీక్రెసీని పాటిస్తున్నారు. ఓ కానుకను ఆయన తీసుకు వచ్చారని, దాన్ని నేడు మోదీకి స్వయంగా జిన్ పింగ్ అందిస్తారని, అది ఏంటన్నది మాత్రం సస్పెన్స్ అని చైనా రాయబార కార్యాలయ అధికారులు చెబుతుండటం గమనార్హం. ఇక ఆ అరుదైన కానుక ఏంటో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
Narendra Modi
China
Jinping
Gift

More Telugu News