Tirumala: తిరుమలలో ద్విచక్ర వాహనంపై అన్యమత స్టిక్కర్.. గమనించకుండా వదిలేసిన అలిపిరి సిబ్బంది

  • గమనించి సమాచారం ఇచ్చిన భక్తులు
  • జీఎన్సీ టోల్‌గేట్ వద్ద పట్టుకున్న భద్రతా సిబ్బంది
  • స్టిక్కర్ తొలగించి వదిలిపెట్టిన వైనం
స్కూటీపై తిరుమలకు వచ్చిన ఇద్దరు భక్తులు కలకలం సృష్టించారు. వారి వాహనంపై అన్యమత ప్రచార స్టిక్కర్ ఉండడంతో గమనించిన శ్రీవారి భక్తులు భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘాట్‌ రోడ్డులో దూసుకుపోతున్న స్కూటీని చూసిన భక్తులు ఇచ్చిన సమాచారంతో జీఎన్సీ టోల్‌గేట్ వద్ద భద్రతా సిబ్బంది స్కూటీని పట్టుకున్నారు. అనంతరం దానిని తనిఖీ చేయగా, వారి వద్ద అన్యమత ప్రచారానికి సంబంధించి ఎటువంటి సామగ్రి లేదని తేలింది. తాము దైవ దర్శనానికి మాత్రమే వచ్చామని వారు చెప్పడంతో వాహనానికి ఉన్న అన్యమత ప్రచార స్టిక్కర్‌ను తొలగించి వదిలిపెట్టారు. కాగా, అన్యమత ప్రచారానికి సంబంధించిన స్టిక్కర్ ఉన్నప్పటికీ అలిపిరి తనిఖీ కేంద్రంలోని సిబ్బంది గమనించకుండా విడిచిపెట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tirumala
Tirupati
alipiri
Tamil Nadu

More Telugu News