Indigo flight: విమానంలో దుస్తులు విప్పేసి విదేశీయుడి హంగామా.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- ఢిల్లీ విమానంలో దుస్తులు విప్పేసిన ప్రయాణికుడు
- శంషాబాద్‌లో పోలీసులకు అప్పగించిన విమాన సిబ్బంది
- డ్రగ్స్ మోతాదు మించడం వల్లేనని అనుమానం
ఓ విదేశీయుడు చేసిన హంగామాతో ఢిల్లీ వెళ్తున్న విమానం అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి వచ్చింది. స్వీడన్‌కు చెందిన అలెగ్జాండ్రా (35) అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లేందుకు గోవాలో ఇండిగో విమానమెక్కాడు. ఆ తర్వాత కాసేపటికే అతడు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తన సీటులోంచి లేచి దుస్తులు విప్పేసి విమానంలో అటూఇటూ తిరగడం మొదలుపెట్టాడు.
అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని దుస్తులు తొడిగేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం విఫలం కావడంతో వెంటనే శంషాబాద్ విమానాశ్రయానికి సమాచారం అందించారు. వారి అనుమతితో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం అలెగ్జాండ్రాను సీఐఎస్‌ఎఫ్ అధికారులకు అప్పగించారు.
సీఐఎస్ఎఫ్ అధికారులు అతడిని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. అతడి మానసిక స్థితిపై అనుమానంతో పోలీసులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అలెగ్జాండ్రా శరీరంపై ఎర్రటి మచ్చలు ఉండడంతో బహుశా అతడు డ్రగ్స్ తీసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మోతాదు ఎక్కువ కావడమే అతడి ప్రవర్తనకు కారణమని భావిస్తున్నారు.