చిల్లా అటవీప్రాంతంలో ఆగి.. గంగానదిని తదేకంగా పరిశీలించిన పవన్ కల్యాణ్!

11-10-2019 Fri 20:54
  • ఉత్తరాది పర్యటనలో జనసేనాని
  • హరిద్వార్ ఆశ్రమంలో బస
  • గంగానది కాలువ వెంబడి ప్రయాణం
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఉత్తరాది పర్యటనలో వున్నారు. హరిద్వార్ ఆశ్రమంలో బస చేసిన పవన్ ఇవాళ పవిత్ర గంగానది పరిశీలనలో కాలం గడిపారు. రిషికేశ్ లోని గంగా బ్యారేజ్ నుంచి ప్రయాణం మొదలుపెట్టిన జనసేనాని, ప్రధాన కాలువ వెంబడి ప్రయాణిస్తూ ప్రవాహ ఒరవడిని గమనించారు. ఇరువైపులా దట్టమైన అడవులు ఉన్నా, పవన్ చిల్లా అనే ప్రాంతంలో ఆగిపోయారు. అక్కడ గంగ ఒడ్డునే ఆగి తదేకంగా నదిని పరిశీలించారు. దాదాపు పావుగంట సేపు అక్కడే ఉండిపోయిన పవన్ ఆపై హరిద్వార్ చేరుకున్నారు. పవన్ వెంట వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ విక్రమ్ సోని, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ ఉన్నారు.