vice president: ‘ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రిసెంట్’ అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • కామొరోస్ అత్యున్నత పురస్కారం అందుకున్న వెంకయ్యనాయుడు
  • 130 కోట్ల భారతీయుల తరపున గౌరవాన్ని స్వీకరిస్తున్నా
  • భారత్-కామొరోస్ మైత్రికి గుర్తు ఈ పురస్కారం

ఆఫ్రికా దేశం కామొరోస్ అత్యున్నత పౌర పురస్కారాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందుకున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో ఆయన పర్యటిస్తున్నారు. కామొరోస్ అధ్యక్షుడు అసౌమని చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. ‘ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రిసెంట్’ అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని, 130 కోట్ల భారతీయుల తరపున గౌరవాన్ని స్వీకరిస్తున్నానని అన్నారు. భారత్-కామొరోస్ మైత్రికి గుర్తుగా పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందని, సంయుక్త లక్ష్యమే తమను కలిపిందని, పరస్పర పురోగతి స్వప్నమిదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News