cm: సీఎం కుర్చీలో పిచ్చోడిని కూర్చోబెట్టినా ఇంకా బాగా పాలిస్తాడేమో!: అయ్యన్నపాత్రుడు

  • ఇసుక కొరతను నిరసిస్తూ దీక్ష చేస్తే అరెస్ట్ చేస్తారా?
  • పోలీసులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు
  • మా నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయిస్తారా?
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీలో పిచ్చోడిని కూర్చోబెట్టినా ఇంకా బాగా పాలిస్తాడేమోనని వ్యాఖ్యానించారు. ఇసుక కొరతను నిరసిస్తూ దీక్ష చేసిన వారిని అరెస్ట్ చేస్తారా? అని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని, పోలీసులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించిన అయ్యన్నపాత్రుడు, తాము కూడా ప్రైవేట్ కేసులు వేస్తామని హెచ్చరించారు.
cm
jagan
Ayyanna Patrudu
Telugudesam

More Telugu News