TV9: రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్ విచారణను వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

  • అక్రమంగా నిధులను డ్రా చేసుకున్నారంటూ రవిప్రకాశ్ పై కేసు
  • కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును కోరిన బంజారాహిల్స్ పోలీసులు
  • సోమవారానికి విచారణను వాయిదా వేసిన కోర్టు

టీవీ9 నిధులను అక్రమంగా డ్రా చేసుకున్నారనే ఆరోపణల కేసులో ఆ చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను నిన్న విచారించిన కోర్టు... తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. ఈరోజు వాదనలను విన్న తర్వాత తదుపరి విచారణను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.

More Telugu News