Kurnool District: కర్నూలు జిల్లాను అతలాకుతలం చేసిన భారీ వర్షం!

  • జిల్లాపై వరుణ ప్రతాపం
  • పలు మండలాల్లో వర్షం
  • పొంగి పొరలుతున్న వాగువంకలు
  • నిలిచిపోయిన వాహనాల రాకపోకలు

కరవు తాండవిల్లే రాయలసీమలోని కర్నూలు జిల్లాపై వరుణుడు ప్రతాపం చూపించాడు. నిన్న జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షపు నీరు వెళ్లేందుకు సరైన మార్గాలు లేక, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. మంత్రాలయం, వెల్దుర్తి, గోనెగండ్ల, కౌతాళం, హోళగుంద, హాలహర్వి, ఆస్పరి మండలాల్లో కుంభవృష్టి కురిసింది.

ఈ వర్షపు నీటితో ఆదోని పట్టణం జల దిగ్బంధమైంది. రహదారులపై రెండు నుంచి మూడు అడుగుల ఎత్తున నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. స్థానిక శంకర్ నగర్ కాలనీలోకి వర్షపు నీరు చేరి, ఇళ్లన్నీ నీట మునిగాయి. హాలహర్వి మండలంలోని వాగు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో నిట్రవట్టి మండల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇక చాగలమర్రి మండలంలో 500 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయని సమాచారం. నేడు కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

  • Loading...

More Telugu News