వారి నిర్బంధమే చట్ట విరుద్ధం.. మళ్లీ సంతకాలు కూడానా: మెహబూబా ముఫ్తీ ఫైర్
- ఈ ప్రభుత్వం తన ఉచ్చును తానే బిగించుకుంటోంది
- కశ్మీర్ ప్రశాంతంగా ఉంటే 9 లక్షల మందితో పహారా ఎందుకు?
- ఆందోళనను అణచివేసేందుకే ఇదంతా
గృహ నిర్బంధంలో ఉన్న మెహబూబా ముఫ్తీ ఈ వార్తలపై స్పందించారు. వారి నిర్బంధమే చట్ట విరుద్ధమైనప్పుడు, ఏ చట్టం కింద వారిని షరతులతో విడుదల చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చుక్కాని లేకుండా ప్రయాణిస్తున్న ఈ ప్రభుత్వం తన ఉచ్చును తానే బిగించుకుంటోందని విమర్శించారు. అలాగే, జమ్ముూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం ప్రకటించడంపైనా ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం చెబుతున్నదే నిజమైతే రాష్ట్రంలో ఇంకా 9 లక్షల మంది భద్రతా సిబ్బంది ఎందుకు పహారా కాస్తున్నట్టని ప్రశ్నించారు. ఆందోళనను అణచివేసేందుకే ప్రభుత్వం వారిని మోహరించిందని ముఫ్తీ ఆరోపించారు.