Keerthi Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • ముంబై షెడ్యూల్ పూర్తి చేసిన కీర్తి సురేశ్
  • వెబ్ సీరీస్ లో నటిస్తున్న హన్సిక 
  • 'నేను రెడీ' అంటున్న బాలీవుడ్ హీరో
*  అందాలతార కీర్తి సురేశ్ తాజాగా ఓ హిందీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మిస్తుండగా అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ చిత్రం తొలి షెడ్యూల్ ముంబైలో పూర్తయింది.
*  గతంలో 'పిల్ల జమీందారు', 'భాగమతి' వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు అశోక్ ఇప్పుడు వెబ్ సీరీస్ నిర్మాణంలో బిజీగా వున్నాడు. ఈ క్రమంలో తను రూపొందిస్తున్న ఓ వెబ్ సీరీస్ లో ప్రముఖ కథానాయిక హన్సికను ప్రధాన పాత్రకు తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్ సీరీస్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది.
*  'తెలుగు సినిమాలలో చేయడానికి నేను రెడీ' అంటున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. 'హౌస్ ఫుల్ -4' చిత్రం ప్రచార కార్యక్రమాల కోసం హైదరాబాదుకు వచ్చిన అక్షయ్ మీడియాతో మాట్లాడుతూ, 'తెలుగు సినిమాలలో నటించాలని వుంది. భాష రాకపోయినా నేర్చుకుంటాను. ఎవరైనా అవకాశం ఇస్తే నేను రెడీ' అని చెప్పాడు.
Keerthi Suresh
Ajay Devagan
Hansika
Akshay Kumar

More Telugu News