omc: ఓఎంసీ కేసును విశాఖకు బదిలీ చేయొద్దన్న సీబీఐ

  • ఈ కేసును హైదరాబాద్ నుంచి విశాఖకు బదిలీ చేయొద్దు
  • బదిలీ చేస్తే కేసు విచారణ ఆలస్యమవుతుంది
  • ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా

సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ కేసు (ఓఎంసీ) బదిలీ విషయంలో సీబీఐ తన వాదన మార్చింది. ఈ కేసును హైదరాబాద్ నుంచి విశాఖకు బదిలీ చేయొద్దని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. ఈ మేరకు సవరించిన మెమోను దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన కుట్ర ప్రధానంగా హైదరాబాద్ లోనే జరిగిందని, రాష్ట్ర విభజనకు ముందే చార్జిషీట్లు దాఖలు అయ్యాయని న్యాయస్థానానికి తెలిపింది. ఈ కేసును విశాఖపట్టణానికి బదిలీ చేస్తే విచారణ ఆలస్యమవుతుంది కనుక హైదరాబాద్ లోనే విచారణ జరపాలని కోరింది. ఈ వాదనలు విన్న సీబీఐ న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News