Telugudesam: ఇప్పటికే అమలవుతున్న పథకాన్ని నిలిపివేసి ‘కంటి వెలుగు’ ప్రారంభిస్తారా?: దేవినేని ఉమ

  • టీడీపీ హయాంలో కంటి పరీక్షలకు ‘ఐ’ ప్రవేశపెట్టాం
  • ఆ పథకాన్ని నిలిపివేసి.. దాని పేరు మార్చేశారు
  • గ్రామ పంచాయితీలకు వైసీపీ రంగులపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
ఏపీలో టీడీపీ హయాంలో ప్రజలకు కంటి పరీక్షల నిమిత్తం ‘ఐ’ పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించామని, ఇప్పటికే అమలవుతున్న ఈ  పథకాన్ని నిలిపివేసి ‘కంటి వెలుగు’ పేరిట అదే పథకాన్ని ప్రారంభించారని విమర్శించారు. ఏపీలో గ్రామాలను అంధకారంలో పెట్టి కంటి వెలుగు తెస్తాననడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చారని, తిరుమల కేంద్రంగా పులివెందుల పంచాయతీలు చేయడం దుర్మార్గమని విమర్శలు చేశారు. పింక్ డైమండ్ పోయిందని నాడు వైసీపీ ఆరోపణలు చేసిందని, ఇప్పుడు అధికారంలోకి రాగానే అసలు పింక్ డైమండే లేదని అంటోందని ధ్వజమెత్తారు. ఏపీలో గ్రామ పంచాయితీలకు వైసీపీ రంగులు వేయడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
Telugudesam
Devineni
Uma
YSRCP
jagan

More Telugu News